ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యగమనిక. జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కేంద్ర విద్యాశాఖ రూపొందించిన కొత్త కరిక్యులమ్ ను టీఆర్టీలో చేర్చింది విద్యాశాఖ. అంటే మారిన సిలబస్ ప్రకారం నిశిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరుతో తయారు చేసిన నివేదికను ఆగస్టు 23న కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాన్ని టీఆర్టీ సిలబస్ లో చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు ఎన్ సీఎప్ 2004 ఎన్సీఎఫ్టీఈ 2009లను కూడా చేర్చింది. జాతీయ నూతన విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
పూర్తిగా చదవండి..TRT : తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. మారిన సిలబస్.. ఈ టాపిక్స్ చదవండి..!!
ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అభ్యర్థులు ఇక నుంచి లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. టీఆర్టీకి హాజరయ్యే అభ్యర్థులు ముఖ్యంగా బోధనా విధానాల్లో వస్తున్న మార్పులపై నిశితంగా పరిశీలించేలా ప్రశ్నలుంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. సిలబస్ మారిన నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి టాపిక్స్ చదవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Translate this News:











