AIR India Sale: విమానంలో ప్రయాణించాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఎయిర్ ఇండియా. స్పైస్‌జెట్ (SpiceJet) తర్వాత టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా కూడా చౌక ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. నాలుగు రోజుల ప్రత్యేక విక్రయాలను కంపెనీ ప్రారంభించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్ నెట్‌వర్క్‌లో కంపెనీ ఈ 96 గంటల విక్రయాన్ని ప్రారంభించింది. దీని కింద దేశీయ రూట్లలో వన్‌వే టికెట్ (One way ticket) ధర ఎకానమీ క్లాస్‌కు రూ.1,470, బిజినెస్ క్లాస్‌కు రూ.10,130 నుంచి ప్రారంభం అవుతుంది. ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల టిక్కెట్లను కూడా అదే ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్ ఇండియా (AIR India) వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేస్తే అందుబాటులో ఉంటుంది.
పూర్తిగా చదవండి..AIR India : ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్..రూ. 1470కే దుబాయ్, యూరప్ వెళ్లే ఛాన్స్..!!
స్పైస్ జెట్ తర్వాత ఎయిర్ ఇండియా కూడా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం రూ. 1470కే విమానం ప్రయాణించే అవకాశాన్ని కలిపిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Translate this News:











