స్వాతంత్ర్య సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిపెట్టేందుకు ఎందరో తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు స్వాంతంత్ర్య పోరాటంలో పాల్గొని ఆంగ్లేయుల నుంచి దేశానికి విముక్తి కల్పించారన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగానే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: దేశంలో పేదరికం లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాంపల్లిలోనీ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Translate this News:











