Udhayanidhi Stalin on Sanatana Dharma remarks row continues: తమిళనాడు ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత ఎంకే స్టాలిన్ (M.K. Stalin) తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మ’ వ్యాఖ్యలపై మౌనం వీడారు. ఉదయనిధి ఏమి మాట్లాడారో తెలియకుండా ప్రధాని (PM Modi) వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు స్టాలిన్. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం సామాజిక న్యాయం భావనకు విరుద్ధంగా ఉందని.. అది డెంగీ, మలేరియాతో సమానామని చెప్పడం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారి తీసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై వస్తోన్న విమర్శలు అర్థం లేనివన్నారు. తమిళనాడు సీఎం ‘అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా బీజేపీ అనుకూల శక్తులు అతని వైఖరిని సహించలేకపోతున్నాయని.. అందుకే తప్పుడు కథనాన్ని వ్యాప్తి చేశాయని మండిపడ్డారు. అసలు ఉదయనిధి మారణహోమానికి పిలుపునిచ్చారంటూ చేస్తున్న ప్రచారంలో అసలు నిజం లేదని… ఉదయనిధి ఆ మాటలు ఎక్కడ అన్నారో చూపించాలన్నారు స్టాలిన్.
పూర్తిగా చదవండి..Sanatana Remarks Row: మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్.. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీతో పోల్చిన రాజా!
సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగానే.. మరో డీఎంకే మంత్రి రాజా కొత్త దుమారాన్ని రేపారు. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ(HIV)తో పోల్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించిన ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్ వేశారు. 'జాతిహత్య' అనే పదాన్ని ఉదయనిధి అసలు ఎక్కడా అనలేదని.. అన్ని విషయాలు తెలుసుకోకుండా మోదీ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదంటూ చురకలంటించారు.

Translate this News:












