PM Modi is the center of attraction at the BRICS summit : బుధవారం బ్రిక్స్ సదస్సు సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్ విజయవంతం అయిన తర్వాత, ప్రపంచదేశాలకు చెందిన నేతలు ప్రధాని మోదీని అభినందించారు. చాలా మంది నేతలు ప్రధాని మోదీని కలుసుకుని మిషన్ విజయవంతమైనందుకు కంగ్రాట్స్ చెప్పారు. ఇందులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కూడా పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: బ్రిక్స్ సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ..!!
ఆగస్టు 23, 2023 గురువారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు భారత్ సరికొత్తచరిత్ర సృష్టించింది. దక్షిణ ధృవం వద్ద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా పలువురు ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని మోదీ..చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ గా నిలిచారు.

Translate this News:











