CBSE Board Exams To Be Held Twice A Year: CBSE బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనుండడం విద్యార్థులకు ప్రయోజనమేనంటున్నారు టీచర్లు. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) అప్డేట్ చేసిన కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంతో, ఇప్పుడు బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయని కేంద్రం మొన్న (ఆగస్టు 22) ప్రకటించింది. దీనివల్ల విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్కోర్లను మెరుగుపరచుకోవడానికి విద్యార్థులకు మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించనుంది. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించడానికి, పరీక్షలు సులభతరం చేసినట్టు కేంద్రం చెప్పుకుంటోంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది టర్మ్ వైస్ ఎగ్జామ్స్ కాదు.. రెండు పరీక్షల్లో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
కొత్త నిర్ణయాలేంటి?
CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి?
ఏడాదికి రెండు సార్లు CBSE పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్పై ఒత్తిడి తగ్గుతుంది. స్కోర్‌ని కూడా పెంచుకోవచ్చు. ఇక నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు జరగనుండగా.. వాటిలో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Translate this News:











