స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ (Quash Petition) మీద ఈరోజు విచారణ జరిగిన విషయం తెలిసిందే. దీనితో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరిగింది. వీటిల్లో క్వాష్ పిటిషన్ మీద విచారణ వాయిదా పడింది. ఈ నెల ( సెప్టెంబర్)19వ తేదీకి ఈ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. దాంతో పాటూ ఈ నెల 18వరకు సీఐడీ వేసిన పిటిషన్స్ పై కూడా ఎలాంటి విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వద్దని ఏపీ హైకోర్టు (AP High Court)ను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు లాయర్లు. దీనిపై స్పందించిన కోర్టు సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ పిటిషన్పై పూర్తి వాదనలు ఇంకా వినాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. అందుకే వాయిదా వేస్తున్నామని తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
పూర్తిగా చదవండి..AP High Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మళ్ళీ దెబ్బ పడింది. క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని సెప్టెంబర్ 19వ తేదీకి ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 18 వరకు సీఐడీ పిటిషన్ వేసిన కస్టడీ పిటిషన్స్ మీద కూడా ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది.

Translate this News:











