Aditya L-1 mission: దేశంలో తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 (Aditya L-1 mission)సిద్ధమైందని, సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (isro) చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somnath) తెలిపారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఇస్రో చీఫ్, చంద్రయాన్ -3 యొక్క చాలా శాస్త్రీయ మిషన్ లక్ష్యాలు ఇప్పుడు పూర్తి కావస్తున్నాయని, ఇస్రో బృందం రాబోయే 13-14 రోజుల కోసం ఎదురుచూస్తోందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Aditya L-1 mission : సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం: ఇస్రో చీఫ్..!!
ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగం గురించి కీలక ప్రకటన చేశారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్. దేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ని సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం సిద్ధంగా ఉందన్నారు. ఇది శ్రీహరికోటకు చేరుకుని పీఎస్ఎల్వీకి చేరిందని తెలిపారు. దీన్ని ప్రయోగించడమే ఇస్రో తదుపరి లక్ష్యమన్నారు. రెండు రోజుల్లో తేదీని ప్రకటిస్తామన్నారు.

Translate this News:











