మొత్తానికి నటుడు నవదీప్ పోలీసు విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ కేసులో A29గా ఉన్న అతడిని కేసుకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.నాలుగు గంటలుగా నవదీప్ విచారణ కొనసాగుతోంది. విచారణలో హీరో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్డ్రనిసార్గ్స్లు అడిగినా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని చెప్తున్నట్టు సమాచారం.రామచంద్ర కు తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనని కానీ అవి డ్రగ్స్ కు సంబంధించినవి కాదంటున్నాడు నవదీప్. పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు ఆధారాలు చూపించగా…దానికి మౌనమే సమాధానంగా ఉందని తెలుస్తోంది. డ్రగ్స్ వినియోగదారుడిగా హీరోని గుర్తించామని నార్కోటిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతను రామ్ చందర్ దగ్గరే కాక ఎవరెవరి నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారనే కోణంలో ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..navdeep:ఐదు గంటలుగా కొనసాగుతున్న విచారణ, నవదీప్ అరెస్ట్?
తెలుగు నటుడు నవదీప్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా నార్కొటిక్ బ్యూరో అధికారులు రెండురోజుల క్రితం అతనికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే నవదీప్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కార్యాలయంలో విచారణకు వచ్చారు. నాలుగు గంటలగా విచారణ జరుగుతోంది.

Translate this News:











