Nalgonda: నల్గొండ జిల్లాలో అవినీతి అధికారి అడ్డంగా బుక్కైయాడు. మహేందర్ రెడ్డి (Marriguda MRO) అనే వ్యక్తి మర్రిగూడ మండలంలో తహసీలద్దార్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మహేందర్రెడ్డి. దీంతో మర్రిగూడ తహసీల్దార్ మహేందర్రెడ్డి ఇంట్లో ఏసీబీ(Anti Corruption Bureau) అధికారులు దాడులు చేపట్టారు. ట్రంక్ పెట్టెలో దాచి పెట్టిన నగదును గుర్తించారు. ఆ ట్రంక్ పెట్టెను వెల్డర్ సాయంతో తెరిచారు. కట్టల కొద్ది నొట్ల కట్టలు దొరకడంతో అధికారులు షాక్ అయ్యారు. కౌంటింగ్ మిషన్ సాయంతో నగదు లెక్కించగా.. రూ.2 కోట్లుగా తేలింది. అంతే కాకుండా మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం కూడా దొరికింది.
పూర్తిగా చదవండి..Nalgonda: అడ్డంగా బుక్కైన తహసీలద్దార్.. ఎటు చూసినా నోట్ల కట్టలే..!!
నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీలద్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంట్లో కట్టల కొద్ది నొట్ల కట్టలు దొరికాయి. దాదాపు రెండు కోట్లుకు పైగా నగదు లభ్యం అయింది.అంతే కాకుండా మహేందర్ రెడ్డి ఇంట్లో కిలోల కొద్ది బంగారం దొరికినట్లు తెలుస్తోంది.

Translate this News:











