Chandrababu Case Updates: స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) సంబంధించి రేపు.. అంటే సోమవారం అత్యంత కీలకంగా మారనుంది. ఏసీబీ కోర్టు (ACB Court) నుంచి మొదలుకుని హైకోర్టు (High Court), సుప్రీంకోర్టు (Supreme Court) వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే వెలువడనున్నాయి. దీంతో రేపు ఏం జరగబోతుందోన్న ఉత్కంఠ టీడీపీ (TDP) శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ (CID) తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం(ఈనెల 9న) విచారణ జరగనుంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్పై కూడా విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీలో బీసీ మహిళా అధికారికి అన్యాయం.. అంతా ఆ మంత్రి కారణంగానే?
Chandrababu Case Updates: చంద్రబాబుకు బిగ్ డే.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు.. 6 తీర్పులు రేపే!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు నుంచి మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే వెలువడనున్నాయి. రేపు ఆయనకు ఊరట లభించకపోతే మరికొన్ని రోజులు జైలులోనే ఉండే అవకాశం ఉంది.

Translate this News:











