ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలంటూ పలుచోట్ల హంగామా సృష్టిస్తున్నారు యువకులు. వారి వారి సర్కిల్స్ లోని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేందుకు రేవ్ పార్టీని ప్లాన్ చేసుకుంటారు. ఫుల్ గా మందు తాగి చిందులు తొక్కుతారు. అయితే, కొన్ని సార్లు ఇలాంటి రేవ్ పార్టీలలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు.
పూర్తిగా చదవండి..Vizag News: పార్టీకి పిలిచి ప్రాణం తీసిన ఫ్రెండ్స్.. ఆ అమ్మాయి కోసమేనా?
విశాఖ జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది. రేవ్ పార్టీలో ఓ యువకుడిని తోటి స్నేహితులే స్విమ్మింగ్ ఫూల్ లో తోయడంతో అతను చనిపోయాడు. మృతుడిని సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. అయితే, ఓ యువతి కోసం జరిగిన గొడవలోనే సాయి వర్మను హత్య చేశారని వార్తలు వస్తున్నాయి.

Translate this News:











