ఓ వ్యక్తి ఎలాంటి భయం, జంకు లేకుండా భారీ నాగుపాముకు స్నానం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బాత్రూంలో పాముకు నీళ్లతో కడుగుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే.. పాములకు సెల్ఫ్ ప్రొటెక్షన్గా చర్మం రూపొందుతుందని.. దానికి స్వయంగా శుభ్రపరుచుకునే వ్యవస్ధ ఉంటుంది. కాగా అసలు నిప్పుతో చెలగాటమాడాల్సిన అవసరం ఏముంది..? అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే..19 సెకండ్ల వ్యవధిలో ఈ వీడియోలో ఓ వ్యక్తి మగ్ నుంచి నీటిని కోబ్రాపై పోస్తుండటం కనిపిస్తోంది. ఓ వీడియోలో ఆ వ్యక్తి పాము తలను పట్టుకుని స్నానం చేయించడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
పూర్తిగా చదవండి..king cobra: వామ్మో… పాముతో పరాచకాలు, తేడా వస్తే ఉంటాయా ప్రాణాలు
టెక్నాలజీ పెరగటంతో సోషల్ మీడియా విస్తృతి పెరిగింది. దీంతో పాములతోపాటు ఇతర జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెద్ద నాగుపాముకు స్నానం చేయిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Translate this News:











