ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు భారీ షాక్ తగిలింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియను మేరీ ల్యాండ్ కోర్టు పక్కనపెట్టింది. ఎన్నికలు నిర్వహించకుండానే ఈసీ సభ్యుల నియామకం చెల్లదని తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 29 వ తేదీ నుంచి 90రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలని పాలకమండలిని నియమించాలని తానాను కోర్టు ఆదేశించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ (BoD) పదవికి పోటీ చేసిన మురళీ తాళ్లూరి, శ్రీధర్ చావా, చక్రధర్ పరుచూరు ఎన్నికను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు నిర్వహించకుండా EC సభ్యులను ఎంపిక చేయాలనే తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తానా బోర్డు చర్య కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని, తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని వారు వాదించారు.
పూర్తిగా చదవండి..తానాకు షాక్…అమెరికా కోర్టు కీలక ఆదేశాలు..!!
తానా ( తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)కు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించకుండా సభ్యులను నియమాకాన్ని మేరీ ల్యాండ్ సర్క్యూట్ కోర్టు రద్దు చేసింది. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని తానాను కోర్టు ఆదేశించింది. మురళీ తాళ్లూరి అనే సభ్యుడు ఎంపిక ప్రక్రియను సవాలు చేయడంతో తానా నిబంధనలను ఉల్లంఘించిందని వాదించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ కు ఉపశమనం కల్పించడంలో వైఫల్యం ఇబ్బందులను కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. తానా ఎన్నికలను రద్దు చేసి తీర్మానం ద్వారా సభ్యులను ఎన్నుకుంది. ఈ చర్య అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి తీవ్ర విమర్శలకు కారణమయ్యింది.

Translate this News:











