Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ మూవీ షూటింగ్స్‌లతో మళ్లీ బిజీ కానున్నారు. కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)ట్వీట్ చేసింది. సెప్టెంబరు 5 నుంచి ఉస్తాద్ భారీ షెడ్యూల్ జరగనుందని వెల్లడించింది. పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ భారీ సెట్ నిర్మించినట్లు తెలిపింది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీ షెడ్యూల్‌కు ఉస్తాద్ సిద్ధం
కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మళ్లీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తార్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు.

Translate this News:











