Car Hits Constable in Hyderabad: హైదరాబాద్లోని చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను ఓ కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల కోడ్(Telangana Election Code) నేపథ్యంలో అక్టోబర్ 18వ తేదీన హైదరాబాద్(Hyderabad) చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కానిస్టేబుల్ మహేష్ మరికొందరు అధికారులు నాకబంది విధులు నిర్వహిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో వాహనాలను ఆపి తనిఖీ చేస్తుండగా.. ఇంతలో ఓ కారు వస్తుండగా దానిని ఆపేందుకు ప్రయత్నించాడు కానిస్టేబుల్ మహేష్. అయితే, కారు డ్రైవర్ కారును ఆపకుండా కానిస్టేబుల్ను ఢీకొట్టి, తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పక్కనే ఉన్న ఇతర సిబ్బంది.. వెంటనే కానిస్టేబుల్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ బయటకు రావడంతో విషయం వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిదో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్లో బరితెగించిన దుండగులు.. కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి, తొక్కుకుంటూ..
హైదరాబాద్లోని చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ను ఓ కారు ఢీకొట్టుకుంటూ వెళ్లింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

Translate this News:











