A Brutal Attack by an employer on three ST Women: కృష్ణా జిల్లాలో జై భీమ్ సీన్ రిపీట్ అయింది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచికంగా దాడికి తెగబడ్డాడు. రెండు రోజులు బందీలుగానే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీసారు బాధితులు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా మోపిదేవి ఎస్ఐ కనీసం తమ గోడు వినడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నీ చట్టాలు తెచ్చిన ఎస్టీలపై ఏ మాత్రం దాడులు ఆగడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..కృష్ణా జిల్లాలో జై భీమ్ సీన్ రిపీట్..ముగ్గురు ఎస్టీ మహిళలపై..
కృష్ణా జిల్లా కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి తెగబడ్డాడు. రెండు రోజులు బందీలుగానే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా మోపిదేవి ఎస్ఐ కనీసం తమ గోడు వినడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దయనీయ స్థితిలో ఉన్నారు బాధితులు .

Translate this News:











