Libya Floods: లిబియా జరిగిన దారుణం ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. ఒక్కరాత్రిలోనే 20 వేల మంది చనిపోయారు అంటే నమ్మశక్యం కావడం లేదు. కానీ నమ్మక తప్పని ఈ చేదు సంఘటనకు కారణం కేవలం ఒకే ఒక్క రాకాసి అల. దాదాపు ఏడు మీటర్ల ఎత్తుకు పొంగుకొచ్చిన ఈ భారీ అల లిబియాలోని డేర్నా నగరాన్నంతటినీ
ముంచేసిందని చెబుతున్నారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ నిపుణులు. ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం చివర వరకు ఉంటుందని అంటున్నారు. సముద్రంలో అల తనతో పాటూ తీసుకొచ్చిన బురదతో డేర్నాలోని పెద్ద పెద్ద భవనాలను కూల్చేయడమే కాక ప్రజలను సముద్రంలోకి ఈడ్చుకువెళ్ళిపోయింది. పోనీ ఇదేదో ఉదయం పూట జరిగి ఉంటే కనీసం ప్రజలు వెంటనే అలర్ట్అయ్యేవారు తమ ప్రాణాలను కాపాడుకునే వారు. కానీ మంచి నిద్రలో ఉన్న సమయంలో జరగడంతో వారికి కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. సెప్టెంబర్ 10వ తేదీ తెల్లవారుఝామున 3 గంటలకు జరిగిందీ సంఘటన.
Libya Floods: ఒకే ఒక్క రాకాసి అల వేల ప్రాణాలను మింగేసింది.
ఒకే ఒక్క అల మొత్తం ఊరంతటినీ ముంచేసింది. ఆదమరిచి నిద్రపోతున్న ప్రజల ప్రాణాలను నీటితో ఊపిరాడనివ్వకుండా చేసింది. తేరుకునేలోపునే ఘోరం జరిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 వేల మంది తెల్లారేసరికి సముద్రంలో శవాలు అయి తేలారు.

Translate this News:












