RGV comments on CBN Gratitude Concert: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు హాట్ హాట్‌గా మారాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో గత 52 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సంఘీభావ ప్రదర్శనలు చేపట్టడం తెలిసిందే.అయితే చంద్రబాబు అరెస్ట్ పై గత కొన్ని రోజులుగా వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు నారా లోకేష్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
పూర్తిగా చదవండి..ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా ఇలా చేయడం..ఆర్జీవీ ట్వీట్.!
ఓ మాజీ సీఎం జైల్లో ఉంటే సంగీత కచేరీ నిర్వహించడం ఇదే మొదటిసారి అంటూ డైరెక్టర్ వర్మ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. "సెలబ్రిటీ కార్యక్రమాలు ఏదైనా విషాద ఘటన కారణంగానో, నిరసనల కారణంగానో రద్దవడం చాలాసార్లు విన్నాను. కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే సంగీత కచేరీ నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. అది చంద్రబాబు విషయంలో జరిగింది" అంటూ ట్వీట్ చేశారు.

Translate this News:











