Champapet Swapna Case updates: హైదరాబాద్‌లో చంపాపేట్‌లో జరిగిన స్వప్న హత్య కేసు సంచలనంగా మారింది. స్వప్న అనే యువతి దారుణ హత్యకు గురైంది. అనంతరం భర్త ప్రేమ్ కుమార్ రెండో అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అయితే, నిజం మాత్రం వెలుగులోకి రావడం లేదు. చంపాపేట్ స్వప్న హత్య కేసు మిస్టరీగానే మిగిలింది. కాగా, స్వప్న హత్యకు వివాహేతర బంధమే కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఇదిలా ఉండగా, స్వప్న భర్త ప్రేమ్ కుమార్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో వున్నాడు. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. స్వప్న హత్య జరిగిన రోజే అదే బిల్డింగ్ పైనుంచి అనుమానాస్పద స్థితిలో కిందపడిపోయాడు భర్త ప్రేమ్ కుమార్. అయితే ప్రేమ్ కుమార్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే ప్రేమ్ కుమార్‌ని స్వప్న బాయ్‌ఫ్రెండే చంపేందుకు యత్నించాడా? స్వప్నను చంపింది భర్త ప్రేమ్ కుమారా? లేక బాయ్‌ఫ్రెండ్ సతీషా? అనే సందేహలు తలెత్తుతున్నాయి. అంతేకాదు, అన్నయ్య అని చెప్పి స్వప్నతో అద్దెకున్న హన్మంతు ఎవరనేది క్లారిటీ రావడం లేదు. అసలు హన్మంతు ఇప్పుడు ఎక్కడున్నాడు? హన్మంతుకు ప్రేమ్‌కుమార్‌కు ఎలా పరిచయం? ఇలాంటి ప్రశ్నలకు స్వప్న భర్త ప్రేమ్ కుమార్ స్పృహలోకి వస్తే తప్ప జవాబులు దొరికడం లేదు.
Also Read: అది తట్టుకోలేకే క్రిష్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!
మృతురాలు స్వప్నకు , ప్రేమ్ కుమార్‌కు నెల క్రితం వివాహం జరిగినట్లుగా సమాచారం. అయితే ప్రేమ్ కుమార్‌తో పెళ్లికి ముందే స్వప్నకు యువకుడు సతీష్ తో ప్రేమ వ్యవహారం వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భర్త ప్రేమ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో ప్రియుడు రావడం.. ఒక్కసారిగా అతను వెనక్కి తిరిగి రావడం, ఈ సమయంలోనే ఘర్షణ జరిగి వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో స్వప్న దంపతులు నివసిస్తున్న ఇంట్లో నుంచి పెద్ద శబ్ధం రావడంతో యజమాని లోపలికి వెళ్లి చూడగా స్వప్న రక్తపు మడుగులో పడి వుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు యువకులు ఇంట్లో నుంచి వేగంగా నడుచుకుంటూ రావడం చూశామని స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఎవరా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
[vuukle]











