Kerala Blasts updates: కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 2000వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..కేరళలో పేలుళ్లు..రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్.. లొంగిపోయిన నిందితుడు..!
కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పెట్టింది తానేనని త్రిసూర్ జిల్లాలోని కొడకరా పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం. అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఈ పేలుడుతో అతడికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళలోని కొచ్చిలో ఈ ఉదయం పేలుళ్లు జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

Translate this News:











