Manchu Vishnu Injured: మంచు విష్ణు ఈసారి కన్నప్ప సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఎవరు కూడా ట్రై చేయని కన్నప్ప కథను అతను తీసుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా నటిస్తూ ఉండడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
పూర్తిగా చదవండి..అయ్యో ..మంచు విష్ణుకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్..!!
‘కన్నప్ప’ షూటింగ్లో టాలీవుడ్ హీరో మంచు విష్ణు గాయపడ్డాడు. న్యూజిలాండ్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణుపై పడింది. దీంతో ఆయన చేతికి గాయాలయ్యాయి. వెంటనే షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారు. వెంటనే మంచు విష్ణుకి చికిత్స స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Translate this News:















