తెలుగులో ఉదయ్ కిరణ్ నటించిన ‘నువ్వు నేను’ సినిమా గుర్తింది కదా.. ఆ సినిమాలో ఓ ట్రాన్స్లేషన్ సీన్ అందరికి గుర్తిండే ఉంటుంది. ప్రిన్సిపాల్ MS నారాయణ ఇంగ్లీష్‌లో స్టూడెంట్స్‌కు ఇచ్చే స్పీచ్‌ని ధర్మవరపు సుబ్రహ్మణ్యం మక్కికిమక్కికి అనువదిస్తుంటాడు. The Whole College అని నారాయణ అంటే ‘కాలేజీలో బొక్క పడింది’ అని ధర్మవరపు అనడం ఈ సినిమా బెస్ట్ కామెడీ సీన్స్‌లో ఒకటి. అలాంటి సీనే బయటే రిపీట్ అయితే? అది కూడా రాజకీయ వేదికలపై కనిపిస్తే? అది కూడా ఎన్నికల టైమ్‌లో ఓ పార్టీ ఫుల్ జోష్‌లో ఉన్నప్పుడు ట్రాన్స్లేషన్ నవ్వులు పూయిస్తే? సరిగ్గా అదే జరిగింది. సినిమాలో కాలేజీలో ఎలా అయితే బొక్క పడిందో.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అంతకంటే పెద్ద బొక్కే పడింది.
పూర్తిగా చదవండి..TS Congress: ఇదేం అనువాదం అయ్యా.. డీకే మీటింగ్ పై కాంగ్రెస్ శ్రేణుల గుస్సా.. ఎందుకంటే?
అనువాదం(ట్రాన్స్లేషన్) కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసింది. తాండూరు సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడింది ఒకటైతే కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి అనువదించింది మరొకటి. కర్ణాటకలో 5 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. తెలంగాణలో మాత్రం హామీ ఇచ్చిన విధంగా ఉచిత కరెంట్ ఇస్తామని శివకుమార్ చెప్పారు. దీన్ని సగమే అనువదించి వదిలేశారు రామ్మోహన్. అటు రేవంత్‌రెడ్డి సీఎం అవుతారంటూ అసలు డీకే శివకుమార్ చెప్పనిదాన్ని చెప్పి కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు లేపారు.

Translate this News:











