ఒక కుటుంబంలో ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనే ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకుంటాయి. కానీ ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విషాదాన్ని ఊహించగలరా?. అచ్చం అలాంటి ఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతే కాదు తమ ఆత్మహత్యలకు గల కారణాన్ని ఓ సూసైడ్ నోట్లో రాసింది ఆ కుటుంబం. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. ‘అడాజన్ అనే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మనీష్ సోలంకి(35) , అతని భార్య రీటా(32) నివసిస్తున్నారు. ఈ దంపతులకు దిశ(7), కావ్య(5,) ఖుషాల్(3) ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభ(60) కూడా అక్కడే ఉంటున్నారు.
పూర్తిగా చదవండి..Sad News: అప్పులు ఇచ్చి అనంతలోకాలకు.. ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య.. ఎక్కడంటే?
గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఏకంగా ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ కుటుంబం ఓ సూసైట్ నోట్ రాసింది.

Translate this News:











