Israel-Hamas War: హమాస్ సంస్థను నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం (IDF) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. గాజాలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ‘అల్- షిఫా’ (Al Shifa hospital).. కేవలం హాస్పిటల్ మాత్రమే కాదని.. అది హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు ప్రధాన కార్యాలయంగా కూడా పనిచేస్తోందని ఆరోపణలు చేసింది. ఆసుపత్రి భవనం కింద భూగర్భంలో ఓ నివాసం ఉన్నట్లు ఐడీఎఫ్ ఓ వీడియోను బయటపెట్టంది. గాజాలో (Gaza) ఉన్నటువంటి రహస్య ఉగ్రవాద స్థావరాలను బట్టబయలు చేస్తామని హెచ్చరికలు చేసింది. మరోవైపు గాజాలో శుక్రవారం రాత్రి వైమానిక దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాది అబు రకాబా హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Israel-Hamas War: అది ఆసుపత్రి కాదు.. హమాస్ ఉగ్రవాద కార్యాలయం: ఇజ్రాయెల్
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న వేళ.. ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తున్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని హమాస్ చెబుతోంది.

Translate this News:











