Suryapet Crime: సినీ ఫక్కీ తరహాలో రెండు అనుమాన్పద హత్య కేసులను సూర్యాపేట జిల్లా పోలీసులు చేధించారు. అయితే హత్యల వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. భర్తను చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఓ మహిళ అందరినీ నమ్మించింది. అలాగే అదే మహిళతో వివాహేతర బంధంలో ఉన్న ఓ వ్యక్తి.. తన భార్యను కరెంట్ స్తంభానికి తలను బాది హత్య చేశాడు. రెండు కేసుల్లో పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం బళ్లుతండాకు చెందిన వెంకన్న..కుటుంబంతో కలిసి సూర్యాపేటలోని భాగ్యనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. మరోవైపు నూతనకల్ మండలం ఎర్రపహాడ్కు చెందిన షేక్ రఫీ తన భార్య నస్రీన్తో కలిసి శ్రీరాంనగర్లో ఉండేవాడు.
పూర్తిగా చదవండి..Crime News: రెండు కుటుంబాలను ఆగం చేసిన అక్రమ సంబంధం.. సూర్యాపేటలో షాకింగ్ ఘటనలు
సూర్యాపేట జిల్లాలో రెండు అనుమానస్పద హత్య కేసులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించగా.. మరో మహిళ తన భర్తను హత్య చేయించి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వీళ్లిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చివరికి ఈ రెండు కేసులను విజయవంతంగా చేధించారు.

Translate this News:











