ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూడేళ్ల క్రితం(2020) ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన సహ నటి రియా చక్రవర్తితో డేటింగ్ చేస్తున్నాడు. దీంతో రియా సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె 28 రోజుల పాటు జైలు జీవితం గడిపింది. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రియా తన జైలు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. రియా తన జైలు అనుభవం గురించి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా పంచుకుంది. తాను జైల్లో ఉన్న సమయంలో చాలా మంది మహిళలు చుట్టుముట్టారని, చిన్న విషయాలలో కూడా తను ఆనందాన్ని పొందానని నటి చెప్పుకొచ్చింది. జైలు గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడి వాతావరణం గురించి చెప్పింది. జైల్లో తోటి ఖైదీలు తనను బాగా చూసుకున్నారని.. సంతోషకరమైన క్షణాలు.. జీవితంలోని చిన్న విషయాలను అభినందిస్తుంటాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..Rhea Chakraborty : ‘నా జీవితం నరకం కంటే దారుణంగా ఉంది’.. సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ సంచలన కామెంట్స్..!!
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సంచలన కామెంట్స్ చేశారు. సుశాంత్ మరణం తర్వాత రియా చక్రవర్తి 28 రోజుల జైలు శిక్ష అనుభవించారు. తాజాగా నటి తన జైలు అనుభవాలను పంచుకుంది. ఆ సమయంలో తీవ్ర గందరగోళంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ మానసికంగా దృఢంగా ఉండాలని భావించానంది.

Translate this News:











