తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులకు పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా తమ దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం ఓ అల్టిమేటమ్‌ను జారీ చేసింది. ఒకవేళ వెళ్లకపోతే వారిని గుర్తించి చర్యులు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు అక్రమ వలసదారులకు ఎవరైనా షెల్టర్ ఇస్తే వారిపై కూడా చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే పాకిస్థాన్‌లోని వేలాది మంది ఆఫ్ఘానిస్థాన్ జాతీయులతో పాటు అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులందరూ కూడా నవంబర్ 1న గడువు కంటే ముందే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని.. తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బూగ్తీ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Pakisthan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు పాకిస్థాన్ వార్నింగ్
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు వెంటనే వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీలోగా స్వచ్ఛందగా దేశం విడిచి వెళ్లాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

Translate this News:











