సాకేంతిక రంగంలో రోజురోజుకు మార్పులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో.. సంబంధిత సంస్థలు తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. అలాగే కంపెనీల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా.. గతేడాది ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి ఎక్స్ (ట్విట్టర్)లో ఆడియో, వీడియోకాల్ సౌకర్యాన్ని అందించనున్నారు. ఇప్పటికే మెటా ఆధ్వర్యంలో ఉన్న వాట్సాప్‌లో ఎప్పటినుంచో ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఉంది. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే ఎక్స్ ఈ సౌకర్యాన్ని తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
పూర్తిగా చదవండి..X: ఫోన్ నెంబర్ లేకున్నా.. ఎక్స్‌లో ఇకనుంచి ఆడియో, వీడియో కాల్స్..
ఎక్స్(ట్విట్టర్)లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు తాజాగా మరో కొత్త అప్డేట్ను తీసుకొచ్చారు. ఇకనుంచి ఎక్స్‌లో ఆడియో, వీడియోకాల్ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఎక్స్ కూడా తమ వినియోగదారుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Translate this News:











