అది చెక్ రిపబ్లిక్(Czech Republic)లోని ఓ ప్రాంతం.. అంతా ఓ గ్రౌండ్‌కు చేరుకున్నారు.. వేల మంది అక్కడే నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. కెమెరాలన్ని అక్కడ నిలపడి ఉన్నవారివైపే ఫోకస్ చేసి ఉన్నాయి. పై నుంచి దేవుడు ఏమైనా వస్తున్నాడా అని అనుమానం కలిగిలే వారి ఎదురుచూపులు కొనసాగాయి. అందరిలోనూ ఒక్కటే ఆనందం.. కాస్త టెన్షన్.. అక్కడ ఏం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు తెలుసు.. కానీ ప్రపంచానికి తెలియదు. వీడియో చూస్తున్న వాళ్లకి చాలా సేపు అర్థంకాలేదు.. ఆకాశంవైపు ఎందుకుచూస్తున్నారా అని. ఇంతలోనే ఛఫ్ఫ్ఫ్ఫ్(chuff) అంటూ సౌండ్ వినపడింది. అందరూ ఒక్కసారిగా కళ్లు పెద్దవి చేశారు. గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న చెట్లు గాలికి ఊగిపోతున్నాయి. హెలికాఫ్టర్ వస్తుంటే అలానే ఉంటుంది కదా. హెలికాఫ్టర్ నుంచి వేలాడుతూ కంటైనర్ కనిపిస్తోంది. అందరూ ఆ కంటైనర్ వైపే చూస్తున్నారు. సడన్‌గా ఆ కంటైనర్ తెరుచుకుంది. అందులో నుంచి నోట్ల కట్టల వర్షం కురిసింది. డబ్బులు తీసుకునేందుకు ఎగబడ్డారు.
పూర్తిగా చదవండి..Money Flood: రూ.8 కోట్ల నోట్ల కట్టల వర్షం.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా?
హెలికాఫ్టర్ నుంచి ఓ కంటైనర్ ద్వారా నోట్ల కట్టల వరదను పారించాడు ఓ టీవీ హోస్ట్. ఏకంగా రూ. 8 కోట్ల రూపాయలను హెలికాఫ్టర్‌కి వేలాడదీసిన ఓ కంటైనర్ నుంచి జారవిడిచాడు. దాదాపు 4 వేల మంది ఈ డబ్బు కోసం ఎగబడ్డారు. ఈ ఘటన యూరోపియన్ దేశమైన చెక్ రిపబ్లిక్లో జరిగింది. ఆ టీవీ హోస్ట్ ఎందుకలా చేశాడు..?

Translate this News:












