టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర13వ రోజుకు పంగులూరు మండలంలో కొనసాగింది. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కశ్యపురం గ్రామం నుంచి మండలంలోని జనకవరం గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేరా సైకిల్ యాత్ర సాగింది. సైకిల్ యాత్రలో భాగంగా తొలుత గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. అనంతరం గ్రామ మహిళలు హారతులు ఇచ్చిన తర్వాత సైకిల్ యాత్ర ప్రారంభమైంది. సైకిల్ యాత్ర చేస్తున్న గొట్టిపాటి రవికుమార్ పై గ్రామస్థులు పూల వర్షం కురిపించారు.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర13వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.

Translate this News:











