మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాలతో దూకుడు పెంచేశాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మొత్తంగా చూసుకుంటే.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల్లో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ఇదిలాఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల వేడి.. కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రాజకీయ వేడి నెలకొంది. తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కార్యక్రమాలను కార్యక్రమాలను చూసుకునేందుకు నలుగురు ఏఐసీసీ సెక్రటరీలను కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓ ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది.

Translate this News:











