వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్(Parag Desai)పై అసలు కుక్కలు దాడి చేయలేదా? కుక్కల దాడిలో ఆయన మెదడుకు దెబ్బతగిలినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదా? పరాగ్ దేశాయ్ మరణంలో ఊహించని ట్విస్ట్ ఇది. కుక్కలు దాడి చేస్తే గాట్లు ఉండాలి కదా.. పరాగ్ దేశాయ్ శరీరంపై ఎక్కడా కూడా ఒక్క కుక్క గాటు కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనకు చికిత్స చేసిన ఆస్పత్రి వర్గాలే చెప్పడం సంచలనంగా మారింది. మరి పరాగ్ మృతికి కారణం ఏంటి? అసలు ఆస్పత్రి వర్గాలు ఏం చెప్పాయి?
పూర్తిగా చదవండి..Parag Desai death: వీధి కుక్కలు అసలు దాడి చేయలేదు.. పరాగ్ మరణంలో ఊహించని ట్విస్ట్!
వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మృతిలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. కుక్కల దాడిలో ఆయన మెదడుకు దెబ్బతగిలినట్టు.. చివరికి మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతు ప్రాణాలు విడిచారన్న వార్తలపై షాల్బీ ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. ఆయన శరీరంపై కుక్క కాటుకు సంబంధించి ఎలాంటి గుర్తులు లేవని చెప్పారు. పరాగ్ కిందపడిపోయిన తర్వాత కుటుంబసభ్యులు ముందుగా షాల్బీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. తర్వాత అక్కడ నుంచి జైడస్ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల కోసం ఎన్నో చేసిన పరాగ్.. వాటిని చూసి భయపడే వ్యక్తి కాదని జంతు హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Translate this News:












