పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపాడులో వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి(Krishna Reddy) దారుణహత్యకు గురవడం అటు స్థానికంగానూ, ఇటు రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. పక్కా పథకం ప్రకారం కత్తులతో దాడిచేసి హత్య చేశారు ప్రత్యర్థులు. కృష్ణారెడ్డిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. గ్రామానికే చెందిన పరమేశ్వర రెడ్డికి , కృష్ణారెడ్డికి మధ్య గొడవలు ఉన్నాయి. పాతకక్షలతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. అయితే దసరా పండుగ కావడంతో స్వగ్రామానికి వచ్చిన ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారడం సంచలనం సృష్టించింది. కృష్ణారెడ్డి హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..AP Crime News: కృష్ణారెడ్డి హత్యకు రాజకీయ రంగు.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య యుద్ధం!
పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి దారుణహత్య రాజకీయ రంగు పులుముకుంది. గురజాల మండలం జంగమహేశ్వరపాడులో కృష్ణారెడ్డి హత్యకు గురికావడం అక్కడి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ కేసులో మాజీ శాసనసభ్యులు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇక వ్యక్తిగత కక్షలు, ఇతర ఎఫైర్స్‌తో కృష్ణారెడ్డి హత్య జరిగితే రాజకీయ రంగు పులమాలని చూస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు.

Translate this News:











