Bhuvaneswari Nijam Gelavali Yatra: ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali)పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు (Nara Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి బస్సు యాత్ర చేయనున్నారు. మొదటి విడతగా మూడు నియోజకవర్గాలలో మూడు రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది. నిన్న సాయంత్రం తిరుపతి చేరుకున్న నారా భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నేరుగా స్వగ్రామం నారావారిపల్లెకు (Naravaripalli) చేరుకోనున్నారు. నారావారిపల్లెలోని తమ కులదైవం నాగాలమ్మ, గ్రామ దేవత దొడ్డి గంగమ్మ లకు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు నారా భువనేశ్వరి. ఇవాళ రాత్రి స్వగ్రామంలోనే బస చేయనున్నారు.
పూర్తిగా చదవండి..రేపటి నుంచే నారా భువనేశ్వరి బస్సుయాత్ర.. నినాదం ఇదే..!
‘నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమె నేరుగా స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకోనున్నారు. ఈ రోజు తమ కులదైవనికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి స్వగ్రామంలోనే బస చేసి రేపటి నుంచి మొదటి విడతగా మూడు నియోజకవర్గాలలో మూడు రోజులపాటు బస్సుయాత్ర చేయనున్నారు. యాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Translate this News:











