కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిన ఘటన తెలిసిందే. దీనిపై విపక్ష నేతలు సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై బీజేపీ ఎంపీ బండి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా.. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జమ్మి చేసిన సంజయ్.. మీడియాతో మాట్లాడారు.అయితే మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడం చూసి దేశ ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్లైతే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. కమీషన్ల మీద ఉన్న శ్రద్ద.. ప్రాజెక్టు నాణ్యతా ప్రమాణాల మీద లేదని.. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు

Translate this News:











