భారత్ యువ సంచలనం శుభమన్ గిల్ వన్డేల్లో దూసుకుపోతున్నాడు. అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ అదరహో అనిపిస్తున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాది విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 26 పరుగుల చేసిన గిల్ వన్డేల్లో అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఏడో ఓవర్లో ట్రెంట్ బౌల్ట్‌ను బౌండరీకి కొట్టడంతో అతను ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో హాషీమ్ అమ్లా రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. 40 ఇన్నింగ్స్‌లలో అమ్లా 2 వేల పరుగుల మార్క్‌ను చేరుకోగా.. గిల్ 38 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను దాటాడు.
పూర్తిగా చదవండి..IND Vs NZ: సచిన్, కోహ్లీ, రోహిత్ వల్ల కూడా కాలేదు! గిల్ ఏం సాధించాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!
వన్డేల్లో మరో రికార్డు బద్దలు కొట్టాడు టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్. తక్కువ ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై 26 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఈ రికార్డు వచ్చి పడింది. గిల్ 38 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ నమోదు చేయగా.. దక్షిణాప్రికా క్రికెట్ దిగ్గజం అమ్లా 40 ఇన్నింగ్స్‌లలో 2 వేల పరుగుల మార్క్‌ని టచ్ అయ్యాడు.

Translate this News:











