టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu naidu) అక్రమ అరెస్టుకు నిరసనగా వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పిలుపునిచ్చింది. ‘దేశం చేస్తోంది రావణాసుర దహనం – మనం చేద్దాం జగనాసుర దహనం’అంటూ సోమవారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 5 నిమిషాల పాటు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని లోకేశ్(Lokesh) పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని ట్వీట్ చేశారు. ఈమేరకు ఆ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండగని సెలబ్రేట్ చేసుకుందాం అంటూ నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Lokesh: ‘జగనాసుర దహనం’.. వాటిని దహనం చేయాలని లోకేశ్ పిలుపు..!
జగన్‌కి వ్యతిరేకంగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రేపు(అక్టోబర్ 23) దసరా సందర్భంగా ‘దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం’అంటూ రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య మరో కార్యక్రమానికి పూనుకుంది . నాలుగున్నరేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

Translate this News:











