బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండుగ సందర్భంగా జనం పెద్దఎత్తున తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో రద్దీ నెలకొంది. ఉప్పల్, ఎల్బీ నగర్, మెహిదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు సైతం కిక్కిరిసిపోయాయి. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: బతుకమ్మ, దసరా సంబరాలు.. నగరంలో ప్రయాణికుల రద్దీ..
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి రద్దీ వాతావరణం నెలకొంది. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Translate this News:











