నేను జైలుల్లో లేను.. ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. జైలు నుంచి ఆయన రాసిన ఈ లేఖలో తన మనసులో విషయాలను బయట పెట్టుకున్నారు చంద్రబాబు. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరన్నారు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరన్నారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వరలో బయటకొస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..న్యాయం గెలుస్తుంది.. త్వరలో బయటకొస్తా.. చంద్రబాబు సంచలన బహిరంగ లేఖ!
జనమే నా బలం, జనమే నా ధైర్యం అంటూ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా క్షేమం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయన్నారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుందన్నారు.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ లేఖ రిలీజ్ చేశారు.

Translate this News:











