సండే వస్తే చాలు.. నాన్ వెజ్ లవర్స్‌కు పండుగే.. ఆదివారం కోసం ఎదురుచూసే మాంసం ప్రేమికుల సంఖ్య కోట్లలోనే ఉంటుంది. ముఖ్యంగా సిటీల్లో సండే వస్తే ముక్క నోట్లోకి పోవాల్సిందే. అటు వీలేజ్ల్లోనూ అంతే.. యాట పోతు కూర కోసం మార్నింగ్ నుంచి ఏమి తినకుండా మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తుంటారు కొందరు. ఒకవేళ సండే ఏదైనా కారణాల వల్ల మాంసం తినకపోతే ఏదో పొగొట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది నాన్ వెజ్ తినని వారికి పెద్ద బాధ లాగా అనిపించపోయినా అనుభవించేవారికే ఈ ఫీలింగ్ తెలుస్తుంది. ఇక మాంసంతో పాటు పక్కన కాంబినేషన్ వద్దకు వద్దాం. చాలా మందికి నాన్ వెజ్ తింటూ పక్కన కూల్ డ్రింక్స్(సాఫ్ట్ డ్రింక్స్) తాగడం అలవాటుగా ఉంటుంది. అందులోనూ ఇది క్రికెట్ సీజన్ కదా.. ఇండియా మ్యాచ్ సండే వచ్చిందంటే చికెన్ విత్ సాఫ్ట్ డ్రింక్ కాంబో ఉండాల్సిందే. అయితే అలాంటివారికి ఇది కాస్త టెన్షన్ పెట్టే న్యూస్..!
పూర్తిగా చదవండి..Health tips: నాన్ వెజ్ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఇది చదవండి..!
చాలా మందికి నాన్ వెజ్‌తో కాంబోగా సాఫ్ట్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణానికి ఈ అలవాటు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఇలా తినడం ఏ మాత్రం మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా ఇదే అలవాటుకు అడిక్ట్ అయితే కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని సమాచారం.

Translate this News:











