తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ (TS Congress Second List) మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల రెండో జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దసరా (Dasara) తర్వాతే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితా తర్వాత అసంతృప్తులతో హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. సీఈసీ మీటింగ్ తర్వాతే రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రెండో జాబితాలో మిగిలిన అన్ని స్థానాలకూ ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించి అధిష్టానం నేరుగా చర్చిస్తోంది. సెకండ్ లిస్ట్ లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మాణిక్రావ్ ఠాక్రే తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: BJP MLA Candidates: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల.. కేసీఆర్ పై పోటీ చేసేది ఎవరంటే..
TS Congress Second List: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఆలస్యానికి కారణమిదే?
తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ దసరా తర్వాతనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో అధిష్టానం నేరుగా మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే లిస్ట్ ఆలస్యమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Translate this News:











