Ind vs NZ World Cup 2023: మెగా టోర్నీలో టాప్ లో ఉన్న రెండు జట్లు ఇండియా, న్యూజిలాండ్. ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించాయి. అంతేకాదు ఆడిన ప్రతీ మ్యాచ్ లో ప్రత్యర్ధుల మీద ఆధిపత్యాన్ని చూపించాయి కూడా. కానీ ఈరోజు ఇద్దరు సమవుజ్జీలు ఆడబోతున్నారు. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand)…రెండు టీమ్ లు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. జట్టులో అందరు ఆటగాళ్ళు 100శాతం ఆటను ప్రదర్శంచారు. మరి ఇప్పుడు ఈరోజు రెండు టీమ్ లకూ ఐదవ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో విజయం ఎవరిని వరిస్తుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి ఓటమిని ఎవరు రుచి చూస్తారో తెలియాలంటే మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో జరగనుంది.
పూర్తిగా చదవండి..World Cup 2023: మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో?
నెమ్మదిగా వరల్డ్ కప్ లో హీట్ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్ అవుతున్న కొద్దీ మెగా టోర్నీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ప్రపంచకప్ లో ఇవాళ మెగా సమరం జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భారత్, న్యూజిలాండ్ లు నేడు తలపడబోతున్నాయి.

Translate this News:











