Pravalika Boy Friend Gets Bail: టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ కు బెయిల్ వచ్చింది. నిందితుడు శివరాం రాథోడ్ ని నాంపల్లి కోర్టు లో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన కోర్టు శివరాం రాథోడ్ రిమాండ్ కు అనుమతించింది. కానీ ప్రవళిక ఆత్మహత్య కేసులో సరైన సాక్షాధాలు లేనందున నాంపల్లి కోర్టు నిందితుడు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తుతో శివరాంను విడిచి పెట్టాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.
పూర్తిగా చదవండి..ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..నిందితుడికి బెయిల్..!!
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రవళిక హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివరాం రాథోడ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో సరైన సాక్షాధారాలు లేనందున శివరాంకు బెయిల్ ఇచ్చింది. రూ. 5000 వ్యక్తి గత పూచికత్తు తో వదిలేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Translate this News:











