Namo Bharat RapidX Train: దేశంలోనే తొలి రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) కారిడార్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రారంభించారు. సాహిబాబాద్ – దుహై డిపో స్టేషన్ల మధ్య ర్యాపిడ్ ఎక్స్ ‘నమో భారత్’ (Namo Bharat RapidX Train) రైలు సర్వీసులకు పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత నమో భారత్ రైలులో జర్నీ చేశారు. సాహిబాబాద్ నుంచి గుల్దర్కు ప్రయాణించారు ప్రధాని. ప్రయాణంలో భాగంగా రైలు సిబ్బంది, స్కూలు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.
పూర్తిగా చదవండి..RapidX Rail Servicie: రాపిడ్ ఎక్స్ రైల్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ..
భారతదేశ మొట్టమొదటి 'ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ' (RRTS)ని ఢిల్లీ-మీరట్ కారిడార్‌ను జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. శుక్రవారం ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. ఈ ట్రైన్ సర్వీస్ అందుబాటులోకి రావడంతో.. ఢిల్లీ-మీరట్ ప్రయాణ సమయం చాలా వరకు తగ్గింది. 82.5 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-మీరట్ RRTS కారిడార్‌లో.. మొదటిదశగా 17 కిలోమీటర్ల కారిడార్ పూర్తి చేశారు.

Translate this News:











