విశాఖ నగరంలో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫీస్‌లో ప్రశాంతంగా పనిచేసుకుంటున్న ఓ మహిళను ఓ వ్యక్తి అతి దారుణంగా ఆందరు చూస్తుండగానే పొడిచి చంపాడు. ఆరిలోవ ప్రాంతానికి చెందిన సువ్వాడ సుజాతకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా 4 నెలలుగా ఆరిలోవ టీఐసీ పాయింట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. పిల్లలను పోషించుకునేందుకు నగరంలోని ఒక హోమ్ అప్లెయిన్స్ షాప్‌లో చేరింది. 10 రోజుల కిందట అక్కడ ఉద్యోగం మానేసి ద్వారకానగర్ మూడో లైన్‌లోని సత్య శ్రీదేవి కాంప్లెక్స్ మూడో అంతస్తులో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో టెలీకాలర్‌గా చేరింది. బుధవారం ఉదయం ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చింది. ఆరిలోవలో ఉంటున్న పిన్నింటి ఉమామహేశ్వరరావు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సుజాత పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి.. ఆమెను బయటకు పిలిచాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఉమామహేశ్వరరావు తన వెంట తీసుకువెళ్లిన కత్తితో సుజాతను విచక్షణారహితంగా పొడిచాడు. పక్కటెముకల్లో బలమైన గాయమవ్వడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తర్వాత ఉమామహేశ్వరరావు కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Sujata murder case: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..ఆఫీస్‌లోనే హత్య చేసిన వ్యక్తి
వివాహేతర సంబంధం, ఆర్థిక లావాదేవీలు విషయంలో వివాహిత, వ్యక్తి మధ్య మొదలైన ఘర్షణ హత్యకు దారి తీసింది. వేసిన ప్లాన్ ప్రకారం మహిళ పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఎవరికీ డౌట్ రాకుండా తనకు తానుగా గాయపరచుకొని ఆ మహిళ తిరిగి దాడి చేసిందంటూ డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

Translate this News:











