ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు పెరిగిపోతున్నాయి. ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా ఆ పార్టీ అగ్రనేత తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షాద్నగర్లో అధికార బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కేశం పేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాంరెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు కాంగ్రెస్లో చేరారు.
పూర్తిగా చదవండి..BREAKING: షాద్నగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే!
షాద్నగర్లో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంపులో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. ఆయనతో పాటు కేశం పేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాంరెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Translate this News:












