Rahul Gandhi Slams KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో (Jagtial) పర్యటిస్తున్న ఆయన.. కేసీఆర్(CM KCR) పాలనపై విమర్శలు గుప్పించారు. ఇది దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణలో రాచరిక పాలన సాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభించి రైతులను ఆదుకుంటామన్నారు. అలాగే, క్వింటా పసుపు పంటకు రూ.12వేలు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో తనకున్నది రాజకీయ బంధం కాదని.. ప్రేమానుబంధం అని పేర్కొన్నారు. ఈ అనుబంధం ఈనాటిది కాదని, నెహ్రూ, ఇందిరమ్మ నుంచి కొనసాగుతోందన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్..
ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రాహుల్ గాంధీ. అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయని, కానీ, తెలంగాణ కాంగ్రెస్లో చాలా పులులు కలిసికట్టుగా బీఆర్ఎస్తో పోరాడుతున్నాయన్నారు రాహుల్. 'తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్.. ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం' అంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు రాహుల్.

Translate this News:











