వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే ప్రచారాలు , బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ.. విమర్శలు చేసుకుంటున్నాయి. తెలంగాణ, మిజోరాంలో ప్రాంతీయ పార్టీ ప్రభావం ఉండగా.. ముఖ్యంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే హోరాహోరిగా పోటీ జరగనుంది. ఛత్తీస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌కు నవంబర్ 25న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే దేవుని దయతో.. తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని ఓ మహిళ తనతో చెప్పినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ కూడా.. ఆ పదవి తనని విడిచిపెట్టడం లేదని ఆమె తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. తనలో ఏదో దాగుందని.. అందుకే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Ashok Gehlot: ముఖ్యమంత్రి పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తన పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. అలాగే దేవుని దయతో.. తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని ఓ మహిళ తనతో చెప్పినట్లు తెలిపారు. తాను ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టాలని అనుకున్నప్పటికీ కూడా.. ఆ పదవి తనని విడిచిపెట్టడం లేదని ఆమె తనతో చెప్పినట్లు పేర్కొన్నారు.

Translate this News:











