పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడితే తనపై కేసులు పెట్టి లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. రువారం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీపై పోరాడితే తనపై అనేక కేసులు పెట్టి లోక్‌సభలో అడుగుపెట్టకుండా సభ్యత్వం రద్దు చేసి ఢిల్లీలోని తన ఇల్లును లాక్కున్నారన్నారు. ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయలు తన మిత్రులకు కట్టబెడుతున్నారని, నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. నిరుపేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామని నమ్మబలికి మోసగించారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఎక్కడ భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో అక్కడ కేసీఆర్ ఎంఐఎంతో పోటీ చేయించి బీజేపీకి లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. బీజేపీకి బీటీంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందన్నారు.
పూర్తిగా చదవండి..Telangana News: బీజేపీపై పోరాడితే నాపై కేసులు…ఇల్లు లాక్కున్నారు: రాహుల్ గాంధీ
పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీపై పోరాడితే తనపై కేసులు పెట్టి లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు.

Translate this News:











